![]() |
![]() |
.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' బ్రహ్మముడి '. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్- 306 లో.. హాస్పిటల్ బెడ్ పై ఉన్న అప్పు.. బిల్ బావ కట్టాడా అని కనకాన్ని అడుగుతుంది. లక్ష ఇరవై రెండు వేలు బిల్ అయింది. ఎక్కడ తేవాలా అని ఆలోచిస్తుంటే మాతో ఏం చెప్పకుండా మేనేజర్ ను పంపించి బిల్ మొత్తం కట్టేశాడని రాజ్ గురించి అప్పు, కృష్ణమూర్తిలతో కనకం చెప్తుంది. వెంటనే ఫోన్ చేసి థాంక్స్ చెప్పమని కనకంతో కృష్ణమూర్తి చెప్తాడు. అప్పుడే రాజ్ కి కనకం ఫోన్ చేస్తుంది.
రాజ్ కి కనకం ఫోన్ చేయగానే.. అప్పుకి ఎలా ఉంది ఆంటీ అని రాజ్ అడుగుతాడు. ఒక దేవుడు రక్తం ధానం చేశాడు. ఇంకో దేవుడు డబ్బు ధానం చేసి కష్టం తీర్చాడు. ఏమిచ్చి మీ ఋణం తీసుకోమంటావు బాబు అని కనకం అంటుంది. అప్పు క్షేమంగా ఉంది కదా అది చాలు.. మీరు నన్ను దేవుడిని చేయొద్దు. నా చేతుల్లో ఉన్నదే చేసాను. మీరున్న పరిస్థితులలో అంత డబ్బు కట్టలేరని మేనేజర్ ను పంపించి కట్టేశాను. ఇకమీదట మీకే అవసరమొచ్చిన నాకే కాల్ చేయండి. మీ కూతురు మళ్ళీ ఆత్మగౌరవమని నాకు చెప్పదని రాజ్ అంటాడు. ఇక అవన్నీ రాజ్ వెనకాలే ఉన్న కావ్య వింటుంది. బిల్ మీరు కట్టేశారా అని కావ్య ఆశ్చర్యంగా అడుగుతుంది. ఇక రాజ్ చిరాకు పడతాడు. ఈయనేంత ఇంత ప్రేమగా, ఆప్యాయంగా ఉంటాడు. మాకు సపోర్ట్ గా ఉంటాడు. మరి ఆ అమ్మాయి విషయంలో అలా ఉన్నాడేంటి, నేనే అనుమానిస్తున్నానా అని కావ్య అనుకుంటుంది. మరోవైపు అప్పు హాస్పిటల్ నుండి ఇంటికి వస్తుంది. తనని ఆ సిచువేషన్ లో చూసి అన్నపూర్ణమ్మ ఎమోషనల్ అవుతుంది. ఇక అప్పుడే అప్పుకి కళ్యాణ్ ఫోన్ చేస్తాడు. ఇక అన్నపూర్ణమ్మ ఫోన్ తీసుకొని.. అప్పుని ప్రశాంతంగా ఉండనివ్వరా అంటూ కోపంగా మాట్లాడుతుంది. అదేస సమయంలో కనకం ఫోన్ తీసుకొని కవర్ చేస్తుంది. ఇక రాజ్ కావ్య కలిసి సరదాగా మాట్లాటుకుంటారు. కళ్యాణ్ అనామికల శోభనం కోసం పూలు ఆర్డర్ చేస్తుంది. ఇక అదంతా ధాన్యలక్ష్మి విని.. వాళ్ళ శోభనం గది నువ్వు డెకరేట్ చేయొద్దని అనేసరికి కావ్య భాదపడుతుంది.
ఇక అదేసమయంలో కళ్యాణ్ రెండు రకాల జ్యువలరీ నెక్లెస్ లు తీసుకొని కావ్య దగ్గరికి వస్తాడు. ఈ రెండింటిలో ఏది బాగుందో చెప్పండి వదిన.. అనామికకి సర్ ప్రైజ్ గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నా అని కావ్యతో చెప్తాడు. ఇక దూరం నుండి కావ్యని ధాన్యలక్ష్మిని గమనిస్తుంది. నా అభిప్రాయమెందుకు మీ అమ్మని అడగమని కావ్య అంటుంది. మా అమ్మకు వీటిగురించి తెలియదని కళ్యాణ్ అనగానే.. ధాన్యలక్ష్మి వచ్చి కావ్య సెలెక్ట్ చేసిన నెక్లెస్ కాకుండా వేరేది సెలెక్ట్ చేసి అదే బాగుందని చెప్తుంది. నాకు వదిన సెలెక్ట్ చేసిందే నచ్చిందని, నువ్వు సెలెక్ట్ చేసింది నువ్వే తీసుకోమని చెప్పి కళ్యాణ్ వెళ్ళిపోతాడు. ఇక రుద్రాణానిని పాయసం తీసుకురమ్మని స్వప్న ఆర్డర్ చేస్తుంది. తరువాయి భాగంలో అనామిక-కళ్యాణ్ శోభనం రోజున వారి మధ్య గొడవ జరుగుతుంది. మన మధ్య కావ్య, అప్పులను తీసుకురావొద్దని చెప్పాను కదా అని అనామిక అంటుంది. హాల్లోని సోఫాలో అనామిక పడుకోవడం చూసి ఇంట్లో వాళ్ళంతా షాక్ అవుతారు. మాఇద్దరి మధ్యలోకి కావ్య, అప్పులని తీసుకొస్తున్నాడని కళ్యాణ్ గురించి అనామిక చెప్తుంది. ఇక ధాన్యలక్ష్మి కావ్యని తిడుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |